ఉగాది ఉత్సవాలు:  రమణీయం.. భువన విజయం నాటకం..

 ఉగాది ఉత్సవాలు:  రమణీయం.. భువన విజయం నాటకం..

ట్యాంక్ బండ్, వెలుగు: కాసల నాడు బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కవాడిగూడలోని ముదిగొండ శంకరారాధ్య మఠంలో ఉగాది వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మిస్సుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు ప్రదర్శించిన జడ కోలాటం నృత్య రూపకం, చారిత్రాత్మక ‘భువన విజయం’ నాటక ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదే వేదికపై ప్రముఖ కవి భమిడిపల్లి నరసింహమూర్తిని సృజన కళా శిఖామణి బిరుదుతో ఘనంగా సత్కరించారు. 

అనంతరం బ్రహ్మశ్రీ డాక్టర్ తేజోమూర్తుల రామకృష్ణ శాస్త్రి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలికిచెర్ల సూర్యకాంతం, సుబ్రహ్మణ్య మణి, కొండలరావు, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.